తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం వాసులు విష జ్వరాల బారినపడి ఆసుపత్రుల బాట పడుతున్నారు. పది రోజుల్లోనే ఇద్దరు మృతి చెందారు. సుమారు 15 మందికి విష జ్వరం, ముగ్గురికి మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్యాధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు. అలాగే సుద్ధగోతులగూడెం, గాడ్రాల, కావడి గుండ్ల, ఆసుపాక, దురదపాడు, పెద్ద మిద్దె గ్రామాల్లో కూడా విష జ్వరాలు వ్యాపిస్తున్నట్లు సమాచారం.
Admin
తెలుగు వెలుగు టీవీ