Friday, 17 April 2026 07:35:11 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

చిన్న దృష్టిలోపం కూడా పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంది - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 16 April 2026 03:30 PM Views : 37

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న అర్రైవ్ అ లైవ్ రహదారుల భద్రత వారోత్సవం కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డ్రైవర్లకు నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పరీక్షా విభాగాలను కలెక్టర్ సందర్శించి, అక్కడ జరుగుతున్న పరీక్షల విధానం, ఉపయోగిస్తున్న పరికరాలు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను సమగ్రంగా పరిశీలించారు. ఆటో డ్రైవర్లకు ప్రాథమిక దృష్టి పరీక్షలతో పాటు దూర దృష్టి , సమీప దృష్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే అవసరాన్ని బట్టి కంటి ఒత్తిడి, కంటి ఆరోగ్య పరిస్థితులను కూడా పరిశీలించి, వివిధ రకాల కంటి సమస్యలను ముందుగానే గుర్తిస్తున్నారు. కంటి పరీక్షలలో చూపు మందగించడం, మసకగా కనిపించడం, దూరం లేదా సమీపంలో స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలను గుర్తించి, సంబంధిత వైద్యులు తగిన సూచనలు అందిస్తున్నారు. దృష్టి లోపం ఉన్న ఆటో డ్రైవర్లకు తక్షణమే కళ్లద్దాలు అందజేసి, అవసరమైన చికిత్సకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డ్రైవర్లకు కంటి పరీక్షలు అత్యంత ముఖ్యమని, కంటి చూపు స్పష్టంగా లేకపోతే రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు . ప్రతి డ్రైవర్ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించి, నిర్దిష్ట కాల వ్యవధిలో కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ఉచిత కంటి పరీక్షా కార్యక్రమాలను డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని, తమ కంటి చూపును అశ్రద్ధ చేయకుండా సమీపంలో నిర్వహించే శిబిరాల్లో పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స పొందడం ద్వారా డ్రైవర్లు సురక్షితంగా వాహనాలు నడపగలరని, తద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్లలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు రహదారులపై భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరికీ నాణ్యమైన సేవలు అందించి, అవసరమైన వారికి వెంటనే కళ్లద్దాలు, చికిత్స అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రాధ రామ్మోహన్, వైద్యులు, నర్సులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :