తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు గత రెండు సంవత్సరాలుగా చదివి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ ట్రైబల్ డిపార్ట్మెంట్ భారీ.లక్ష్మణ్ ఈరోజు గ్రంథాలయంలో సుమారు ఎనిమిది వేల విలువచేసే స్టాండ్ ఫ్యాన్లను తన కుటుంబ సభ్యుల (వైఫ్) చైతన్య ద్వారా గ్రంథాలయానికి అందజేశారు. గ్రంథాలయాలు నిరుపేద కుటుంబాలకి దేవాలయాల వంటివని గ్రంథాలయము తనకి జీవితాన్ని ఇచ్చిందని తనలాంటి నిరుపేద కుటుంబంలో చదివి ఇంత ఉద్యోగం సంపాదించడానికి గ్రంథపాలకురాలు ఎంతగానో సహాయపడినారని తెలిపారు. తనలాగా ఎంతోమంది ఆదర్శంగా నిలవాలని గ్రంథాలను ఉపయోగించుకొని ఉన్నత స్థానాలను పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ ఉద్దేశించి వినయ విధేయతలు కలిగి చదువుకున్న ఏకాగ్రతతో చదివి ఒక లక్ష్యంగా ఎంచుకొని మంచి జాబ్ సంపాదించుకోవడం చాలా అదృష్టమని కష్టపడి చదివిన వారికి తప్పనిసరిగా ఉన్నత స్థానంలో ఉంటారని లక్ష్మణ్ ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు జి మణి మృదుల లక్ష్మణ్ వైఫ్ చైతన్య గ్రంథాలయ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ