తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్థానిక సంస్థలకు ఎన్నికలకు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా జిల్లా యంత్రాంగం, స్థానిక ఎన్నికల కోసం బాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాలు పూర్తిగా ఏర్పాటు,జిల్లాలో ఎంపీటీసీ, జడ్పిటిసి లకు 2 విడుతలలో, గ్రామపంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) ఐ. రాణి కుముదిని, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్, ఎన్నికల నిర్వహణ, మోడల్ ప్రవర్తనా నియమావళి అమలు, లా అండ్ ఆర్డర్ నిర్వహణ తదితర అంశాలపై ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) ఐ. రాణి కుముదిని మాట్లాడుతూ ....... తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఈ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించిందని ఎంపీటీసీ (మండల పరిషత్ టెర్మినల్ కమిటీ), జడ్పీటీసీ (జిల్లా పరిషత్ టెర్మినల్ కమిటీ), గ్రామ పంచాయతీ ఎన్నికలు మొత్తం ఐదు దశల్లో నిర్వహించనున్నారు. తొలి రెండు దశల్లో MPTC, ZPTC ఎన్నికలు, మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా, రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల నిర్వహణ, మోడల్ ప్రవర్తనా నియమావళి అమలు, లా అండ్ ఆర్డర్ పరిస్థితుల పర్యవేక్షణ వంటి అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరింపు, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలపై కలెక్టర్లు, పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పిటిసి, గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఎన్నికల నియమావళి అనుసరిస్తూ, MPTC, ZPTC ఎన్నికలు రెండు విడతలలో జరుగుతాయని వివరించారు. ఈ మేరకు బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సిబ్బంది నియామకం, మొదటి విడత శిక్షణ తరగతులు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు కూడా తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన అన్ని బాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం వంటి ఏర్పాట్లలో పూర్తిస్థాయిగా సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల అధికారికి వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, ఎలక్షన్ సూపర్డెంట్ రంగ ప్రసాద్ మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ