తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణిలో నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ నియామకాలలో రామవరం, రుద్రంపూర్ ప్రాంత వాసులను కూడా పరిగణలోనికి తీసుకోవాలి సింగరేణి సెక్యూరిటీ జిఎం సత్యనారాయణ ను కలిసిన కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా రామవరం, రుద్రంపూర్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రాంతవాసులకు కూడా అవకాశం కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని సింగరేణి సిఎన్ఎండి మరియు నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ కూడా తెలియ చేయడం జరిగింది అని అన్నారు సింగరేణి భూమి పుత్రులుగా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న అందరికీ అవకాశం కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గుంపుల మహేష్,కృష్ణారెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు ఎనుమూరి శివ కృష్ణ, పట్టణ ఉపాధ్యక్షుడు రాంబాబు నాయక్ మరియు రాజు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ