తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టేకులపల్లి మండలం దాస్ తండాకు చెందిన రైతు బానోత్ శంకర్ మిర్చి నారుపై గుర్తుతెలియని వ్యక్తులు కలుపు మందు పిచికారి చేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కలుపు మందు చల్లడం వల్ల మిర్చి నారు మొత్తం మాడిపోయింది. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, ఎవరితో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ, అన్నం పెట్టే రైతు పొట్ట కొట్టడం సరికాదని అన్నారు. నష్టపోయిన రైతు శంకర్ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ