తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో కూనంనేని 615 మందికి పట్టాలు అందజేత పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తామన కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ మరియు 120మంది మైనార్టీ లబ్దిదారులకు కుట్టు మిషన్లు పంపిణి కార్యక్రంమలో కూనంనేని మాట్లాడుతూ రాష్ట్రంలోనే కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలనే తపనతో పలు రకాల గ్రాంట్లు ద్వారా నిధులు రాబట్టి మౌళిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, DCCB చైర్మన్ కొత్వాల. శ్రీనివాసరావు మరియు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ