తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్పొరేటర్ కేకే శ్రీను, పోస్ట్ ఆఫీస్ వాసు, సూరజ్, అశోక్, అనుదీప్, శ్రీధర్, లడ్డు, రాజేష్, నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, జీఎం దామోదర్ హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కేక్ కట్ చేసి భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు వివరించారు. రాజ్యాంగ రచనకు అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని 1టౌన్ సీఐ కరుణాకర్, 2టౌన్ సీఐ ప్రతాప్, 3టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, కొత్తగూడెం పట్టణ నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ