Friday, 19 June 2026 04:17:48 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత: 15.5 లక్షల మొక్కల లక్ష్యం దిశగా కూర బాలకృష్ణ చారిటబుల్ సర్వీసెస్ కృషి

Date : 05 June 2026 05:50 PM Views : 161

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూర బాలకృష్ణ చారిటబుల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పచ్చదనం పెంపుదలే లక్ష్యంగా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కూర శ్రీధర్ నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమం పర్యావరణ ప్రేమికుల ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా కొత్తగూడెం ఆర్డీవో డి. మధు, డీఎస్పీ ఆదినారాయణరావు, తహసీల్దార్ డి. పుల్లయ్యలకు మొక్కలను బహూకరించి, పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం కొత్తగూడెం సెంట్రల్ పార్కు మరియు బూడిగడ్డలోని కాళికా మాత ఆలయ ఆవరణలో అతిథులు, సంస్థ ప్రతినిధులు కలిసి మొక్కలు నాటారు. అభినందించిన అధికారులు ఈ సందర్భంగా *ఆర్డీవో డి. మధు* మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా 15 లక్షల 50 వేలకు పైగా మొక్కలను నాటడమే కాకుండా, వాటిని విజయవంతంగా సంరక్షిస్తున్న కూర శ్రీధర్ నిబద్ధత అభినందనీయమని కొనియాడారు. *డీఎస్పీ ఆదినారాయణరావు మరియు ఎమ్మార్వో డి. పుల్లయ్య* మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న నేటి కాలంలో మొక్కలు నాటడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. కూర శ్రీధర్ చేస్తున్న ఈ నిరంతర కృషి పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, ప్రకృతిని కాపాడాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మరిన్ని జరగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొయ్యడ నగేష్ సెంట్రల్ పార్క్ అర్బన్ కొత్తగూడెం ఎం జయ కాంతారావు మరియు పార్క్ సిబ్బంది మహంకాళి అమ్మవారి శివాలయ అర్చకులు సాయి అయ్యగారు శీను, సంస్థ సభ్యులు, స్థానిక నాయకులు మరియు పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :