Sunday, 21 June 2026 02:43:48 PM
# నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # బూత్ స్థాయిలో సమగ్ర పర్యవేక్షణతో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి # ఈ నెల 21 ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడి. జిల్లా కలెక్టర్ అంకిత్. # భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్. # రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో. జిల్లాలో యూరియా బుకింగ్‌లలో 72.66 శాతం పంపిణీ పూర్తి – జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు. # భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు. # ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి. # లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి.

పెట్రోల్,డీజిల్ తో పాటు గ్యాస్ కొరత లేదు : మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

Date : 25 March 2026 05:16 PM Views : 199

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్,ఎల్.పి.జి కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తేలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో డీజిల్,పెట్రోల్ బంక్ ల వద్ద పెద్ద ఎత్తున ఉన్న క్యూలను చూసి పెట్రోల్,డీజిల్,ఎల్.పి.జి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంధన వనరులతో పాటు ఎల్.పి.జి కొరత అంటూ వస్తున్న వదంతులతో ప్రజాలేవరు గందరగోళంలో పడొద్దని ఆయన ఉద్బోధించారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తో కలసి ఆయన మీడియాతో ముచ్చటించారు. రానున్న మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని జరుగుతున్న వదంతులతో ఏ ఒక్కరూ అయోమయంలో పడొద్దని ఆయన ఉద్బోధించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్,భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు ఇంధన సరఫరాలను గణనీయంగా పెంచాయని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ నీ మించి సరఫరా కొనసాగుతోందని,ఈ రోజు 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలోలీటర్ల సరఫరా జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు.అంటే 652 కిలో లీటర్ల అదనపు నిల్వ మిగిలిందన్నారు. దీనికి తోడు అదనంగా 16,000 కిలోలీటర్ల ఇంధనం నిల్వ ఉంచడంతో పాటు 1200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. వినియోగదారులు గందరగోళంలో పడి పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడంతొ రజు వారి డిమాండ్ ఒక్కసారిగా 25% పెరిగినా రోజువారీ సరఫరాలో సగటున పోల్చిచూసినపుడు కుడా ఎక్కడా అంతరాయం కలుగ కుండా అదనంగా 22% అందుబాటులో ఇంధన వనరులు నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే కొన్ని పెట్రోలు బంక్ లకు నిర్ణిత సమయానికి ట్యంకర్లు చెరుకోక పోవడంతో ఆయా బంక్ లలో నో-స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయన్నారు.వాస్తవంగా మాత్రం ఎంత మాత్రం కొరత లేదని ఆయన పునరుద్ఘాటించారు. అయితే అదే సమయంలో షికార్లు చేస్తున్న పుకార్లను నమ్మి వినియోగదారులు కంటైనర్లలో,డబ్బాలలో పెట్రోల్, డీజిల్ ని తీసుకెళ్లడం పూర్తిగా చట్టవ్యతిరేకమైన చర్య అని అంతకుమించి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. పెట్రోలియం నిలువలు రానున్న 65 రోజులకు సరిపడా ఉన్నాయని,సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండేలా నిరంతరం కొనసాగేందుకు వీలుగా O.G.C లైన్ ను విస్తరించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర రాజధానిలో 596 పెట్రోల్ బంక్ లు నిరంతరాయంగా పని చేస్తున్నాయని,హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ఎక్కడ కుడా కొరత లేదని,అహ్మదాబాద్, సూరత్,బెంగుళూరు,ధారవాడ ,బెల్గాం వంటి నగరాలలో కూడ ఇదే పరిస్థితి ఉత్పన్నమయ్యాయన్నారు. ఎల్.పి.జి విషయంలో ఎటువంటి కొరత లేదని,కాకపోతే కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో కొంతమేర సమస్య ఉన్నట్లు గుర్తించమన్నారు. ఇదే సందర్భంలో అక్రమంగా వినియోగిస్తున్న 2,952 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. పెట్రోల్,డీజిల్ గృహ వినియోగదారులకు అవసరమైన ఎల్.పి.జి సమృద్ధిగా అందుబాటులో ఉందని,ప్రజలేవరు అయోమయానికి గురి కావొద్దని,వదంతులను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్బోధ* రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్,ఎల్.పి.జి కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తేలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో డీజిల్,పెట్రోల్ బంక్ ల వద్ద పెద్ద ఎత్తున ఉన్న క్యూలను చూసి పెట్రోల్,డీజిల్,ఎల్.పి.జి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంధన వనరులతో పాటు ఎల్.పి.జి కొరత అంటూ వస్తున్న వదంతులతో ప్రజాలేవరు గందరగోళంలో పడొద్దని ఆయన ఉద్బోధించారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తో కలసి ఆయన మీడియాతో ముచ్చటించారు. రానున్న మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని జరుగుతున్న వదంతులతో ఏ ఒక్కరూ అయోమయంలో పడొద్దని ఆయన ఉద్బోధించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్,భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు ఇంధన సరఫరాలను గణనీయంగా పెంచాయని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ నీ మించి సరఫరా కొనసాగుతోందని,ఈ రోజు 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలోలీటర్ల సరఫరా జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు.అంటే 652 కిలో లీటర్ల అదనపు నిల్వ మిగిలిందన్నారు. దీనికి తోడు అదనంగా 16,000 కిలోలీటర్ల ఇంధనం నిల్వ ఉంచడంతో పాటు 1200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. వినియోగదారులు గందరగోళంలో పడి పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడంతొ రోజు వారి డిమాండ్ ఒక్కసారిగా 25% పెరిగినా రోజువారీ సరఫరాలో సగటున పోల్చిచూసినపుడు కుడా ఎక్కడా అంతరాయం కలుగ కుండా అదనంగా 22% అందుబాటులో ఇంధన వనరులు నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే కొన్ని పెట్రోలు బంక్ లకు నిర్ణిత సమయానికి ట్యంకర్లు చెరుకోక పోవడంతో ఆయా బంక్ లలో నో-స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయన్నారు.వాస్తవంగా మాత్రం ఎంత మాత్రం కొరత లేదని ఆయన పునరుద్ఘాటించారు. అయితే అదే సమయంలో షికార్లు చేస్తున్న పుకార్లను నమ్మి వినియోగదారులు కంటైనర్లలో,డబ్బాలలో పెట్రోల్, డీజిల్ ని తీసుకెళ్లడం పూర్తిగా చట్టవ్యతిరేకమైన చర్య అని అంతకుమించి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. పెట్రోలియం నిలువలు రానున్న 65 రోజులకు సరిపడా ఉన్నాయని,సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండేలా నిరంతరం కొనసాగేందుకు వీలుగా O.G.C లైన్ ను విస్తరించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర రాజధానిలో 596 పెట్రోల్ బంక్ లు నిరంతరాయంగా పని చేస్తున్నాయని,హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ఎక్కడ కుడా కొరత లేదని,అహ్మదాబాద్, సూరత్,బెంగుళూరు,ధారవాడ ,బెల్గాం వంటి నగరాలలో కూడ ఇదే పరిస్థితి ఉత్పన్నమయ్యాయన్నారు. ఎల్.పి.జి విషయంలో ఎటువంటి కొరత లేదని,కాకపోతే కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో కొంతమేర సమస్య ఉన్నట్లు గుర్తించమన్నారు ఇదే సందర్భంలో అక్రమంగా వినియోగిస్తున్న 2,952 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. పెట్రోల్,డీజిల్ గృహ వినియోగదారులకు అవసరమైన ఎల్.పి.జి సమృద్ధిగా అందుబాటులో ఉందని,ప్రజలేవరు అయోమయానికి గురి కావొద్దని,వదంతులను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: