తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిని అద్దె ఆటోలో తీసుకెళ్లి మార్గమధ్యంలో అతని వద్ద ఉన్న బంగారపు ఉంగరాలను తస్కరించిన వ్యక్తులను ఈ రోజు కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడంతోపాటు వారి వద్ద నుంచి బంగారం రికవరీ చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచారు.ప్రాథమిక వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 3వ తేదీన మద్యం మత్తులో పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న నర్సయ్య అనే వ్యక్తిని సబ్బరపు ప్రవీణ్ మరియు సబ్బరపు వరుణ్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక కిరాయి ఆటోని ఆపి ఇంటి వద్ద దింపాలని ఆటోలో ఎక్కించుకొని బయలుదేరారు.మార్గమధ్యంలో రామవరం బ్రిడ్జి వద్ద అతన్ని ఆటోలో నుంచి దించి ఆటో వెళ్ళిపోయాక నరసయ్య వేలుకి ఉన్న రెండు బంగారు ఉంగరాలు తస్కరించి పారిపోయారు.వారిపై కేసు నమోదు కాగానే ఈరోజు వారిని పట్టుకుని వారి వద్ద నుండి దొంగిలించిన రెండు బంగారు ఉంగరాలని స్వాధీన పరచుకుని నిందితులని అరెస్ట్ చేసి కోర్ట్ ముందు హాజరు పరచనైనదని 1టౌన్ సీఐ కరుణాకర్ వివరాలను వెల్లడించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ