తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచినపేట గ్రామంలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఆధ్వర్యంలో ఈరోజు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచినపేట గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం ను నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలోని ఇండ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇట్టి సోదాలలో సుమారుగా 4,000/- ల రూపాయల విలువ గల గుడుంబాను, 15,000/- రూపాయల విలువ గల మద్యం బాటిళ్లను, 3500/- రూపాయల విలువ గల గుట్కాలను సీజ్ చేయడం జరిగిందని డిఎస్పీ వెల్లడించారు. సరిగ్గా పత్రాలు లేని 65 వాహనాలకు 8900/- రూపాయల జరిమానాను విధించడం జరిగిందన్నారు. అదేవిధంగా గంజాయి వంటి ప్రభుత్వం నిషేధిత పదార్థాలను కనుగొనడానికి నార్కోటిక్ డాగ్స్ ద్వారా సోదాలని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మట్కా, జూదం, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. ఇట్టి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ