తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 21 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మాల మహానాడు భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో జూలూరుపాడు లో విజయవంతంగా బంద్ నిర్వహించారు . మండలంలోని విద్యాసంస్థలను మండల హెడ్ కోటర్ లోని షాపులన్నీ బంద్ చేశారు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. మాల మహానాడు మండల నాయకులు గుడిపిడి ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పై సమగ్ర విచారణ జరిపి ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని. ఎస్సి వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధంగా చేశారని. ఎస్సీ వర్గీకరణ రద్దు చేసే అంతవరకు మా పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పనితీ గోపాలకృష్ణ. మంద కమలాకర్, బడుగు మౌళి, పుప్పాల రాము, మందపాటి సాగర్, కాసు మల్ల సురేష్, మంద రంజిత్, కల్లోజి వెంకటేశ్వర్లు, బడుగు వీరస్వామి ,మంద కమలాకర్, కల్లోజు దినేష్, వెల్లంగి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ