తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ జూలూరుపాడు మండల వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వాటిల్లో సూరారం, కొత్తూరు, గుండ్లరేవు మూడు నూతన గ్రామపంచాయతీ కార్యాలయాలను ప్రారంభోత్సవం మరియు రెండు గ్రామపంచాయతీలో గుండెపుడి పంచాయితీ రామచంద్రపురం, వినోబా నగర్ గ్రామపంచాయతీ నందు సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, జూలూరుపాడు నుండి పాపుకొల్లు వరకు డబుల్ లైన్ బిటి రోడ్డు ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణ పనులకు శంకుస్థాపన మండల పార్టీ ఆఫీసు నందు లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్, దుద్దుకూరి మధుసూదన్ రావు రామిశెట్టి రాంబాబు, రామిశెట్టి నాగేశ్వరరావు,మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ