తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో విష జ్వరాల బారిన ప్రజలు పడకుండా ముందస్తు చర్యలో భాగంగా దోమల మందు పాగింగ్ (పొగ )కొట్టించటం జరిగిందని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ తెలిపారు. వర్షాకాలం సీజన్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు విష జ్వరాల ప్రబలుతున్నాయని ఎమ్మెల్యే కూనంనేని గారి ఆదేశాల మేరకు
పదో వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ విజ్ఞప్తి మేరకు ఈరోజు మున్సిపల్ కమిషనర్ శేషాంజనం స్వామి యంత్రాన్ని పంపించడం జరిగిందని ప్రజలు పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకొని విష జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది తాళ్ల రాజేషు, ఓర్సు సందీపు, బాబా ,కుమార్ ,అల్లకొండ గోపి తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ