తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెమోరండం అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరహారం చెల్లించాలి, ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలి రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ చేయాలి,యాసంగి సీజన్లో వడ్లకి ఇవ్వాల్సిన బోనస్ డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు వెంటనే ఇవ్వాలి,రైతు కూలీలకు 12,000 ఇంతవరకు ఇవ్వలేదు వెంటనే ఇవ్వాలి,వడ్లు కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి,రైతు భరోసా మూడుసార్లు ఇవ్వాల్సింది ఒక్కసారి ఇచ్చారు మళ్ళీ యాసంగి స్టార్ట్ అవుతుంది కావున వెంటనే రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో వేయాలి,అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్,జల్లారపు శ్రీనివాస్, గుగులోత్ రమేష్,తెల్లం నరసింహారావు,పైడిపాటి రవీందర్,గొడుగు శ్రీధర్ యాదవ్, వందనపు సుబ్బు,నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ