Monday, 20 April 2026 01:56:38 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

సమ్మర్ క్యాంప్ ముగిసిన సందర్భంగా అండర్ 12, 14, 16 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Date : 08 June 2025 07:35 PM Views : 720

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమ్మర్ క్యాంప్ ముగిసిన సందర్భంగా అండర్ 12, 14, 16 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. ఈనెల 8, 9, 10, 11 తేదీల్లో BKDCA జరగనుంది హేమచంద్రపురం లోని బి కే సి ఏ గ్రౌండ్ లో టోర్నమెంట్ ను ప్రారంభించిన కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, సమ్మర్ క్యాంపు ముగిసిన నేపథ్యంలో బాల, బాలికలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన క్రీడల అధికారి పరందామ రెడ్డి నేతృత్వంలో డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (BKDCA) ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మండలం లోని హేమచంద్రపురంలో గల బీకేసీఏ గ్రౌండ్ లో "లిటిల్ చాలెంజర్స్ సూపర్ నాకౌట్స్ ట్రోఫీ – 2025" ఆదివారం నాడు ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ని కొత్తగూడెం డిఎస్పి షేక్ అబ్దుల్ రెహమాన్ ప్రారంభించడం జరిగింది. తొలుత వేదమంత్రాలతో క్రికెట్ పిచ్ మీద పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ.. బాలబాలికల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని, నేటి బాలలే రేపటి పౌరులని అన్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని క్రీడా రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, క్రీడాకారులకు కావాల్సిన మరింత మౌలిక సదుపాయాలను అందిస్తే వారి ప్రతిభను వెలికి తీయవచ్చని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడా రంగాల్లో ప్రోత్సహించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా బాధ్యత వహించాలని సూచించారు.

ఇటీవల కాలంలో క్రికెట్ కి మరింత క్రేజ్ పెరుగుతుందని ఇందులో భాగంగా చిన్నారులకు ఒక ప్రత్యేకమైన టోర్నమెంట్ నిర్వహించాలనే ఆలోచన రావడం హర్షనీయమని అన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు శ్రీకారం చుట్టిన క్రికెట్ కోచ్ పంతంగి సాయి నిరంజన్ ను ఆయన అభినందించారు. అనంతరం టాస్ వేసి మొదటి మ్యాచ్ ని ప్రారంభించారు. టోర్నమెంట్ లో భాగంగా రెడ్ స్మాషర్స్ వర్సెస్ విక్టరీ వైలెట్స్ మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. రెండు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో విక్టరీ వైలెట్ జట్టు విజయాన్ని సాధించింది. అనంతరం జరిగిన 2వ మ్యాచ్ ను BKDCA ఉపాధ్యక్షులు డాక్టర్ బి.ఎస్.రావు వేసి ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ కి లక్ష్మీదేవిపల్లి మండల ఎస్సై రమణారెడ్డి, డాక్టర్ బి.ఎస్.రానీ వులు క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులను ప్రకటించారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 12 టీంలు పాల్గొనలు ఉన్నాయి. ఇందులో 6–6 టీములను గ్రూప్ – ఏ, గ్రూపు – బి గా విభజించి మ్యాచ్లను నిర్వహించడం జరుగుతుంది. ఈ టీములలో అండర్ –10, అండర్–14, అండర్ –19 జట్ల వారీగా పోటీలను ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ముప్పారపు కరుణాకర్, లక్ష్మీదేవిపల్లి మండలం ఎస్సైలు జి రమణారెడ్డి, విజయసింహా రెడ్డి, ఆర్ఎస్ఐలు జగన్, ఓం ప్రకాష్, అసిస్టెంట్ కోచ్ లు మార్గం నరేందర్, బోయిని ప్రసాద్, కే లోకేష్, పదిరే నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :