తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 5 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం కరి వారి గూడెం గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ లో భాగంగా అర్హులైనటువంటి రైతులకు మాఫీ రాణి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు, రేషన్ కార్డు ఉన్నదా లేదా ఉంటే తప్పు ఒప్పులు పరిశీలించారు , బ్యాంకు ఖాతా వివరాలు, రైతు కుటుంబ సభ్యుల వివరాలు ప్రభుత్వ ప్రత్యేక పోర్టల్ లో నమోదు చేసుకున్నారు,ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు కొత్తగూడెం ఏడిఏ నరసింహారావు, ఏవో దీపక్ ఆనంద్, ఏ ఈ ఓ లు , మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ