తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆదరాభిమానాలు చూపి శుభాకాంక్షలు అందించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రజా సేవలో నిరంతరం ఉంటూ ప్రజా పక్షాన పోరాటాలు కొనసాగిస్తా. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరమని, తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కూనంనేని సాంబశివరావు జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన లేఖతో పాటు పుష్పగుచ్ఛాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌కు పంపారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చూపిన గౌరవానికి, ఆదరానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా తనపై ఆదరాభిమానాలు చూపిస్తూ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, ప్రత్యక్షంగా తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు అందించిన పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజా సేవలో నిరంతరం ఉంటూ ప్రజా పక్షాన పోరాటాలు కొనసాగిస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ