తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 20 తెలుగు వెలుగు) వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు.సంక్షేమ పథకాల బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ రిజర్వేషన్ బిల్లు, రాజీవ్ యువ వికాస్ పథకాలు ,ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా సంతోషముతో మరియు పండుగ వాతావరణం నెలకొంది అని పార్టీ నాయకులు అన్నారు . ఈ శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి మరియు వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్(MLA) చిత్రపటానికి పాలాభిషేకం చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు లేళ్ళ వెంకటరెడ్డి , జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ వెంగన్నపాలెం మాజీ ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు , ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు , నున్న కృష్ణయ్య, లచ్చు నాయక్, ఓబిసి మండల అధ్యక్షులు ఆర్కే నాయుడు, పోతురాజు నాగరాజు, మోదుగ రామకృష్ణ, బాబు, మోహన్, భూక్యా అమ్మరు, మెంతుల కృష్ణ, నర్సిరావు, మాస్, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు, పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ