తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి వేడుకలకు ఎనిమిది లక్షల మెస్సి పది నిమిషాల ఈవెంట్ కోసం సింగరేణి నిధులు 10 కోట్లు సింగరేణి ఉద్యోగులు ప్రతి సంవత్సరం పండుగలా జరుపుకునే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేవలం ఎనిమిది లక్షలా టీబీజీకేస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ.సింగరేణి ఉద్యోగులు ఘనంగా జరుపుకునే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు గతంలో 47 లక్షలు సింగరేణిలోని వివిధ ఏరియాలకు కేటాయిస్తే రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేవలం ఎనిమిది లక్షలు కేటాయించడం దారుణమన్నారు ఈ చర్య సింగరేణి కార్మికుల ఆత్మగౌరాన్ని దెబ్బతీయటమే అన్నారు.డీల్ ఆర్,సింగరేణి కార్మికులు ఉద్యోగులు కష్టపడి తమ చెమట చుక్కలను రక్తాన్ని ధార పోసి బొగ్గు వెలికి తీస్తే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కొంతమంది అధికారులు కార్మికుల సొమ్మును ఇష్టరీతిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విదంగా కేటాయిస్తూ కార్మికులు పండుగలా జరుపుకునే వేడుకలకు మాత్రం నిధులను కేటాయించకుండా కార్మికుల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు.మెస్సి వచ్చిన ఫుట్బాల్ కు 10 నిమిషాల ఆట కోసం పది కోట్ల స్పాన్సర్షిప్ చేసిన సింగరేణి యాజమాన్యం సివిల్ అభయహస్తం పేరిట కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు అదేవిధంగా సి ఎస్ ఆర్, డి ఎం ఎఫ్ టి ఫండ్లను వందల కోట్ల రూపాయలను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణాలు వీధిలైట్ల పేరుమీద కార్మిక ప్రాంతాల్లో కార్మికుల క్వార్టర్లలో ఖర్చు చేయాల్సిన నిధులను ప్రభుత్వం నేరుగా దుర్వినియోగం చేస్తుంది.ఈ సంవత్సరం 8 లక్షలు కేటాయించడం చూస్తే కార్మికులు కార్మిక కుటుంబ సభ్యులతో పండుగల జరుపుకునే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మరిచిపోతున్నారు.కనీసం కొంతమంది ఉద్యోగులకు ఇచ్చే ఉత్తమ కార్మిక అవార్డులను కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురించింది కార్మికులకు, ఉద్యోగులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఒకపక్క వేతనం కూడిన హాలిడే గా ప్రకటించాలని అడుగుతుంటే ఇలా చేయడం కరెక్ట్ కాదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పక్షాన ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు సింగరేణి నిధులు ఎటు వెళుతున్నాయి కార్మికుల సంక్షేమం మరచి మితిమీరిన రాజకీయ జోక్యంతో సింగరేణి నిధులను పక్కదారు పట్టిస్తు వ్యవహరిస్తున్న పద్ధతిని మార్చుకోవాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పక్షాన హెచ్చరిస్తున్నాం .వెంటనే గతంలో లాగా ప్రతి ఏరియాకు మూడు లక్షల చొప్పున సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నిధులు కేటాయించి కార్మికులందరూ సంబరంగా జరుపుకునే విధంగా చేయాలని కోరుతున్నాం.
Admin
తెలుగు వెలుగు టీవీ