Sunday, 19 April 2026 03:26:11 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

కౌజు పిట్టల పెంపకం యూనిట్, చేపల పెంపకం యూనిట్ మరియు కూరగాయల తోటను సందర్శించిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్

Date : 25 August 2025 07:29 PM Views : 491

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కౌజు పిట్టల పెంపకం యూనిట్, చేపల పెంపకం యూనిట్ మరియు కూరగాయల తోటను సందర్శించిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కౌజు పిట్టల పెంపకం ద్వారా ఆదాయ మార్గాలను విస్తరించాలని సూచించిన కలెక్టర్ 10 గుంటల స్థలం ఉన్న ప్రతి మహిళా రైతు కూరగాయలు పండించడానికి ముందుకు రావాలని, జిల్లాలో వెయ్యి మంది మహిళా రైతులను గుర్తించాలని కలెక్టర్ పిలుపు. లక్ష్మిదేవిపల్లి మండలంలోని శేశాగిరినగర్ గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన దుర్గాంబిక గ్రామ సంఘంలోని అరుణోదయ గ్రామ సమాఖ్యలోని ప్రణజ కౌజు పిట్టల పెంపకం యూనిట్‌ను జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం జితేష్ వి. పాటిల్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తొలిసారిగా కౌజు పిట్టల పెంపకం యూనిట్‌ను ప్రారంభించినందుకు మహిళా సంఘాలను అభినందించారు. ప్రతి మండలంలోని మహిళా సంఘాల సభ్యులు కూడా కౌజు పిట్టలను పెంచుకోవాలని, దాని ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. ప్రతి 40 రోజులకు ఒక్కసారి వీటిని అమ్ముకోవచ్చని, మార్కెట్‌లో వీటికి మంచి డిమాండ్ ఉందని తెలిపారు.

తదనంతరం చేపల పెంపక యూనిట్‌ను పరిశీలించి వారికి అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం సుజాతనగర్ మండలంలోని రవి హైబ్రిడ్ సీడ్స్ వారి క్షేత్రాన్ని సందర్శించి, వారు పండిస్తున్న అన్ని రకాల కూరగాయల తోటలను పరిశీలించారు. జిల్లాలో కనీసం 10 గుంటల స్థలం కలిగిన ప్రతి మహిళా రైతు కూరగాయల సాగు ప్రారంభించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైన మౌలిక వసతులు (జిఐ వైరు, ఎదురు గడలు, పాలిథిన్ పేపర్, విత్తనాలు, పెన్సింగ్) వివరాలతో తక్కువ ఖర్చుతో డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను రెండు రోజుల్లో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆధారంగా జిల్లాలో 1000 మంది మహిళా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా లక్ష్మిదేవిపల్లి మండలంలోని రైతు వేదికలో కూరగాయల సాగు, మునగ సాగు, కొర్రమీను చేపల పెంపకం మరియు కౌజు పిట్టల పెంపకాన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టి పర్యవేక్షించాలని సూచించారు. తరువాత సుజాతనగర్ మండలంలోని నాయకులగూడెం గ్రామంలో కొర్రమీను చేపల యూనిట్‌ను నిర్వహిస్తున్న శ్రీమతి మండే స్రవంతిని కలెక్టర్ అభినందించారు. అక్కడే కూరగాయలు, కౌజు పిట్టల పెంపకం చేపడితే అదనపు ఆదాయం లభిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, సుజాతనగర్ యం.పి.డి.ఓ, యం.ఆర్.ఓ, లక్ష్మిదేవిపల్లి యం.పి.డి.ఓ, ఎపియం ఫాం, రెండు మండల ఎపియంలు మరియు సిసిలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :