తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఎం ఎల్ ఏ కూనంనేని సాంబశివరావు పై వేసిన ఎన్నికల అఫిడవిట్ అనర్హత కేసును రాష్ట్ర హై కోర్ట్ కొట్టి వేయటం తో జనం సంబరాలు చేసుకుంటున్నారు. సిపిఐ కార్యాలయం శేషగిరి భవన్ లో బాణాసంచా పేల్చి సీపీఐ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రజా తీర్పు గెలిచింది అంటూ నినాదాలు చేశారు. శేషగిరి భవన్ నుండి ర్యాలీ గా బస్టాండ్ సెంటర్ చేరుకుని సంబరాలు చేసుకున్నారు. పట్టణం లో ర్యాలీ నిర్వహించారు. ఏం ఎల్ ఏ కూనంనేని సాంబశివరావు గత ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి భారీ మెజారిటీ తో విజయం సాధించారు. అనంతరం అఫిడవిట్ లో లోపాలు ఉన్నాయంటూ నందులాల్ అగర్వాల్ అనే వ్యక్తి హై కోర్ట్ ను ఆశ్రయించారు. కేసు పై సమగ్రంగా విచారించిన హై కోర్ట్ ఎలాంటి ఆధారాలు లేవంటూ పిటిషన్ ను కొట్టి వేసింది. హై కోర్ట్ తీర్పు తో కొత్తగూడెం నియోజకవర్గం లో జనం సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉన్న కూనంనేని హై కోర్ట్ లో వాదించిన న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. ఏం ఎల్ ఏ కూనంనేని కొత్తగూడెం రానుండటంతో ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా తీర్పు కు హై కోర్ట్ తీర్పు అనుకూలంగా ఉండటం తో కొత్తగూడెం లో జనం సంబరాలు చేసుకుంటున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ