తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మండపాల ఏర్పాటు కొరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. జిల్లాలో గణేష్ మండపాల నిర్వహణకు ఉత్సవ కమిటీ సభ్యులు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ ???? https://policeportal.tspolice.gov.in/ నందు ధరఖాస్తు చేసుకోవాలని, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపాల నిర్వహణ, మండపానికి సంబంధించిన సమాచారం కొరకు మాత్రమేనని,ఈ సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరియు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులభంగా ఉంటుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.పోలీసు శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని, ఆ తరువాతనే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవ కమిటీలు పాటించవలసిన నియమ నిబంధనలు: గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులదే. ప్రతీ మండపం వద్ద తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలి. గణేష్ మండపాలు ప్రజా రవాణాకు,ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్ నకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం యజమాని మరియు సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి. మండపాల కమిటీ వివరాలు,బాధ్యత వహించే వారి వివరాలు,ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల్లో మరియు శోభాయాత్ర సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలను ఏర్పాటు చేయరాదు. మండపం వద్ద 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించుకోవాలి. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా దగ్గరలో ఇసుక మరియు నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. గణేష్ మండపాల వద్ద మద్యంసేవించడం,పేకాట ఆడటం, అసభ్యకరమైన నృత్యాలు,అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు/పాటలు పూర్తిగా నిషేధం. మండపం వద్ద పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి,విధిగా పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు. అనుమానాస్పదమైన బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు,వస్తువులు,వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి వదంతులను నమ్మకూడదని,ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత పోలీసు అధికారులను లేదా Dial 100 నంబర్‌ను సంప్రదించాలని ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ