తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాలశాఖ అధికారి ( డిపిఆర్ఓ ) ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు జూలూరుపాడు ఎస్సీ కాలనీలో సీజనల్ వ్యాధులపై అవగాహన కోసం శుక్రవారం కళాజాత నిర్వహించారు. ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టుప్రక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తడి చెత్త, పొడి చెత్త వేరుచేయాలని కళాజాత ద్వారా కళాకారులు అవగాహన కల్పించారు.
దీంతోపాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా కళాకారులు తమ పాటలు, మాటల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, సారథి కళాకారుల బృందం లీడర్ బాలు కాంపల్లి, కృపానందం, ముసా, నరేంద్ర, కుమారి, నీలా, కౌసర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ