Friday, 19 June 2026 03:08:56 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

రూ.10కోట్లతో సెంట్రల్ లైటింగ్, ఫోర్ లైన్ రోడ్డుగా మారనున్న కొత్తగూడెం జిల్లా కోర్ట్ రోడ్ - హేమచంద్రపురం బైపాస్..!

Date : 13 June 2025 05:20 PM Views : 6672

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిన సందర్భంగా తొలి అడుగు కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రపురం మీదుగా ఇల్లందు వెళ్లనున్న బైపాస్ రోడ్డుని సెంట్రల్ లైటింగ్ తో ఫోర్ లైన్ రోడ్డుగా ప్రతిపాదిస్తూ కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సింగరేణి ద్వారా సీఎస్ఆర్ ఫండ్స్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతోకాలంగా కొత్తగూడెం నుంచి హేమచంద్రపురం వెళ్లే మార్గం రోడ్లు అద్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఈ బైపాస్ రోడ్డుపై ప్రచూరితమైన ఎన్నో వార్తా కథనాలకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందిస్తూ నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని సింగరేణి సంస్థ సీఎండీ బలరాం నాయక్ కి లేఖను రాశారు. ఈ క్రమంలోనే ఇటీవల కొత్తగూడెం కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అవడంతో అభివృద్ధి పనులను వేగవంతం చేసే దిశగా ఎమ్మెల్యే సాంబశివరావు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే తొలిమెట్టు కొత్తగూడెం నుంచి హేమచంద్రపురం మీదుగా ఇల్లందు వెళ్లే బైపాస్ రోడ్డు వైపు పడింది. ఈ బైపాస్ రోడ్డుని సెంట్రల్ డివైడర్స్, లైటింగ్ తో ఫోర్ లైన్ రోడ్డుగా ప్రతిపాదిస్తూ సింగరేణి సంస్థ నుంచి 10 కోట్ల రూపాయలు సీఎస్ఆర్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే సాంబశివరావు లేఖను రాశారు. త్వరలోనే ఈ బైపాస్ రోడ్డు అత్యద్భుతంగా రూపు దాల్చి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతుందని కొత్తగూడెం ప్రజలు ఆశిస్తున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :