తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో కిడ్నీ ల సమస్యతో బాధపడుతున్న ప్రజలు. వివరాల్లోకి వెళితే అనంతారం గ్రామంలో ఇప్పటివరకు కిడ్నీలలో రాళ్ల ఆపరేషన్ 40 మందికి పైగా జరిగినది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ సోకి సుమారుగా పదిమంది, డయాలసి స్ ఇద్దరు వ్యక్తులకు జరుగుతున్నది. డయాలసిస్ జరుగుతూ ఆరు నెలల్లో చనిపోయిన వారు నలుగురు. గతంలో 20 సంవత్సరాల లోపు వాళ్లు చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా గ్రామంలో ఏ కారణం చేత కిడ్నీ సమస్యలు వస్తున్నాయో తెలియపరచండి అంటూ దీనస్థితిలో గ్రామ ప్రజలు.
Admin
తెలుగు వెలుగు టీవీ