తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కేంద్ర గ్రంధాలయాభివృద్ధితో పాటు జిల్లాలో ఉన్న పలు గ్రంధాలయా అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ గ్రంథాలయ చైర్మన్ వీరబాబు మంగళవారం కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రంధాలయంలో అనేక మౌళిక సదుపాయాల అవసరం ఉందని, అదే విధంగా జిల్లాలో ఉన్న పలు గ్రంథాలయాల అభివృద్ధికి స్థల సేకరణ అవసరం ఉందని అన్నారు. గ్రంధాలయాలను అభివృద్ధి పర్చడం ద్వారా అనేక మంది పోటీ పరీక్షలకు సిద్ద వడే వారికి, పాఠకులకు ఉపయోగ కరంగా ఉంటుందని ఆ వినతి పత్రంలో కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, గ్రంథాలయాల మౌలిక సదుపాయాల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కలెక్టర్ను కలిసి వారిలో అఫీస్ ఇంచార్జ్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ