తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 14 తెలుగు వెలుగు ) జూలూరుపాడు మండలంలోని జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నటువంటి గుండా నాగ రమేష్ కుమార్తె కుమారి గుండా ఊర్మిళా శ్రీ ఖమ్మం లోని కేంద్రీయ విద్యాలయం నందు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యను అభ్యసించి ఈమధ్య పదవ తరగతి పూర్తి చేయటం జరిగింది. నిన్న వెలువడినటువంటి సీబీఎస్ఈ పదవ తరగతి ఫలితాలలో 500 మార్కులకు గాను 477 మార్కులను సంపాదించి పాఠశాలలో ద్వితీయ స్థానాన్ని సంపాదించింది.ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు గుండా రమేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుమార్తె గుండా ఊర్మిల శ్రీ కి శుభాశీస్సులను తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ