తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాల లు వెంగన్న పాలెం నందు ఉన్న సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం స్కూలు మరియు పడమటి నర్సాపురం గ్రామం వశిష్ట విద్యా మందిరం నందు కూడా ముందస్తు బతకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ జిల్లాల్లోని ప్రతి పట్టణం, పల్లెల్లోజరగనున్న తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు బతుకమ్మ ఉత్సవాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాల వేడుకల నిర్వహణపై స్థానికులు విద్యార్థులను అభినందించారు . ఈ సందర్భంగా విద్యార్థుల ఆట పాటలు అలరించాయి. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, చిన్నారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ