తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జులై 6 తెలుగు వెలుగు ) జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామం ఆశ్రమ పాఠశాల దగ్గరలో కొత్తగూడెం నుంచి వస్తున్న లారీ ఖమ్మం నుంచి వస్తున్న మారుతి కారు ఢీకొన్నాయి, ఈ సంఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యి సీరియస్ కండిషన్లో ఉన్నాడు, మిగతా ప్రయాణికులందరికీ తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న జూలూరుపాడు పోలీస్ వారు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్ లో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Admin
తెలుగు వెలుగు టీవీ