తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ ఇటీవల జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన 03గురు సభ్యులకు ప్రభుత్వం నుండి మంజూరైన రివార్డు నగదును అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పని చేస్తూ ఇటీవల కాలంలో జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన ముగ్గురు సభ్యులకు ఈ రోజు 9,50,000/- ల రూపాయల నగదును చెక్కుల రూపంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఎస్పీ కార్యాలయంలో చెక్కుల రూపంలో రివార్డు నగదులను అందజేశారు. రివార్డు నగదు పొందిన సభ్యుల వివరాలు 1. రామ్ సింగ్ కౌడే @ నరోటి మనీష్ @ లోకేష్ @ ఆకాష్ 40yrs, R/o. దేవ్ గావ్ గ్రామం,ఏడ్కా PS,కాంకేర్, నారాయణపూర్ జిల్లా చతీస్ఘడ్ రాష్ట్రం. 5,00,000/-(లక్ష రూపాయలు) 2. ముచ్చికి సోందాల్ @ నరేష్ 30yrs, రాంపూర్ గ్రామం, ఉసూర్ PS, బీజాపూర్ జిల్లా. 3,75,000/- రూపాయలు. 3. సోడి భీమే, D/o.దేవా, 30yrs, R/o. దులెడ్ గ్రామం,చింతగుప్ప PS, సుక్మా జిల్లా, చతీస్ఘడ్ రాష్ట్రం. 75,000/- రూపాయలు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం నుండి మంజూరైన రివార్డు నగదులను వారి పునరావాసం కోసం అందజేయడం జరిగిందని తెలియజేసారు.కాలం చెల్లిన సిద్ధాంతాలతో స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ నాయకులు అమాయకులైన ఆదివాసీలను బలవంతంగా తమ పార్టీలోకి చేర్చుకుని వారి చేత చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయించారని తెలిపారు. లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన మిగిలిన నాయకులు మరియు సభ్యులు ఆయుధాలను వీడి ప్రజాస్వామ్యబద్దంగా ప్రజల హక్కుల తరుపున పోరాడాలని కోరారు.లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునేవారు తమ బంధుమిత్రుల ద్వారా గానీ, స్థానిక పోలీస్ అధికారుల ద్వారా గానీ లేదా స్వయంగా జిల్లా ఎస్పీ ఎదుట గాని లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు.లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా పోలీస్ శాఖ తరపున చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్ మరియు ఆర్ఐ ఆపరేషన్స్ రవి లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ