తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 14 తెలుగు వెలుగు ప్రస్తుత సమాజంలో రాజీ మార్గమే మార్గదర్శకమని సత్వర న్యాయం కొరకై లోక్ అదాలత్ ను ఏర్పాటు చేయడం జరిగినది తెలిపారు. ఇటువంటి రాజీమార్గంలో నడిచినవారే సమాజానికి మార్గదర్శకులని వారు అభినందనీయులు అని అన్నారు. శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి కుటుంబం విచ్చిన్నం కావడంతో కుటుంబంలో కలతలు పెరిగాయని అన్నారు. చిన్న చిన్న గొడవలు మరియు క్షణికావేశంలో చేసిన నేరాలతొ కోర్టు చుట్టు తిరుగుతూ విలువైన కాలండబ్బు వృధా అవుతుందని, కక్షిదారులు ఒక్క అడుగు రాజీ మార్గం దిశగా ప్రయత్నం చేస్తే ప్రతివాదులు రెండు అడుగులు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమం అనంతరం యూనియన్ బ్యాంకు మరియు ఎస్బిఐ బ్యాంక్ వారి సహకారంతో కక్షిదారులకు పులిహార, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రామారావు, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎ. సుచరిత, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ న్యాయవాదులు, బ్యాంక్ అధికారులు, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ