Friday, 17 April 2026 08:51:37 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం.

Date : 17 April 2026 06:56 PM Views : 50

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బాల్య వివాహలకు వ్యతిరేకంగా గోడ పత్రిక ఆవిష్కరణ: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని విద్యా చందన మరియు జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనినా ఎయిడ్ సంస్థ వారి ఆధ్వర్యంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వారి సౌజన్యంతో బాల్య వివాహాల నిర్మూలనకై గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది.బాల్య వివాహాల నిర్మూలనకై అందరూ నడుం బిగించాలని బాలల యొక్క భవిష్యత్తుకు ఎంతో కీలకంగా అని, బాల్య వివాహాలు అనేవి ఒక సామాజిక దురాచారం, అనదిగా కొనసాగుతున్నటువంటి ఈ సాంఘిక దురాచారాన్ని అందరం కలిసి సమూలంగా నిర్మూలించాలని బాల్య వివాహం అనేదే లేని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కై నిరంతరం శ్రమించాలని విద్యాచందన పిలుపునిచ్చారు.ఏప్రిల్ 19 అక్షయ తృతీయ సందర్భంగా యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను ఆమె చాంబర్లో ఆవిష్కరించారు.జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అనునిత్యం గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని బాలల పరిరక్షణ విభాగం ద్వారా బాలలకు సేవలను అందిస్తున్నట్లు తెలిపారు . చిన్న వయసులోనే వివాహం చేయడం వల్ల బాలికలకు శారీరక మానసిక ఆరోగ్య రుగ్మతలు వస్తాయని సరైన పరిపక్వత లేక పుట్టే పిల్లలు కూడా అనేక రకాల లోపాలతో పుట్టడం వల్ల జీవితాంతం ఆ మనోవేదన అనుభవించాల్సి వస్తుందని కొన్ని సందర్భాలలో మాత శిశు మరణాలు కూడా జరుగుతాయని ఈ నష్టాల వలన స్త్రీ పురుష నిష్పత్తి కూడా గణనీయంగా పడిపోతుందని జిల్లా సంక్షేమ అధికారిని ఆఫీసర్ స్వర్ణలత లెనినా తెలిపారు.ఈ కార్యక్రమంలో డి సమ్మక్క డిపిఎం, నర్మద డీపీఎం, అనురాధ ఏపిఎం ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వి రాజేష్ కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్స్ మోహన్ , మాన్సింగ్,జ్యోతి, మౌనిక తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :