తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అలాగే లాభాల్లో కూడా వాటా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 'మొత్తం 25 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల చొప్పున ఇస్తున్నాం. ఇందుకోసం రూ.796 కోట్లు కేటాయించాం. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం. కార్మికులు, ఉద్యోగుల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం' అని ఆయన పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ