తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్ట్ కూలీలైన్ సెక్టార్ లో బుధవారం నాడు 34వ వార్డ్ లోని కమ్యూనిటీ హాల్ నందు సెక్టార్ మీటింగ్ నిర్వహించరు. ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనిన, సూపర్వైజర్ శారదా పాల్గొన్నారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనిన మాట్లాడుతూ పోషణ ట్రాకర్ లో ఫేస్ క్యాప్చర్ లు సరైన సమయంలో పూర్తిచేయాలని, రిపోర్టులు అన్ని కూడా మీటింగ్ లో పొందపర్చాలని. అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వం నిర్ణయించిన సమయానికే తప్పని సరిగా తెరవాలని, అంగన్వాడీ కి వచ్చే పిల్లలకు ఆటపాటలతో విద్యను నేర్పే విధానంలో మెళుకువలను పాటించాలని పిల్లల పౌష్టిక ఆహారం విషయం లో ఎటువంటి నిర్లక్ష్యం వహించద్దని తెలిపారు. తదనంతరం సంక్షేమ అధికారి సూపర్వైజర్ కు శాలువ తో సత్కరించారు, ఈయొక్క కార్యక్రమానికి 34వ వార్డ్ టీచర్లు గిరి లక్ష్మీ, భాగ్య లక్ష్మీ, md జరీనా బేగం, మరియు 21 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ