తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : బండరాయితో బాది.. దారుణంగా హత్య చేసిన ఘటన కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మణుగూరు దుర్గా కంపెనీలో మెకానిక్ హెల్పర్గా పనిచేసే మునిగల ప్రసాద్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ప్రసాద్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం సిద్ధి జిల్లా గోహరికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ