Friday, 19 June 2026 05:52:54 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

తమిళనాడులో శిక్షణ పొందిన అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం – స్థానిక మట్టితో పర్యావరణ హిత నిర్మాణాలు

Date : 22 September 2025 07:42 PM Views : 490

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పశుసంవర్ధక అభివృద్ధికి మేకల షెడ్ల నిర్మాణం – స్థానిక జాతి మేకల పెంపుదలకు కొత్త ప్రణాళికలు. జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాల మేరకు, తమిళనాడు రాష్ట్రంలోని పాండిచ్చేరి ఆరో వెళ్ళు ఎర్త్ ఇన్స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన తర్వాత తిరిగి వచ్చిన తిరుపతయ్య (EC MGNREGS), కార్తీక్ (AE PR), హేమంత్ కుమార్ (AE Housing) సోమవారం కలెక్టర్ ను కలిసి, శిక్షణలో నేర్చుకున్న ముఖ్య విషయాలను వివరించారు.ఈ శిక్షణలో పర్యావరణానికి హాని కలగకుండా, స్థానికంగా లభించే మట్టిని వినియోగించి గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా భవన నిర్మాణాలు చేయడం, అలాగే ఉపాధి హామీ కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలను అభ్యసించారు.ఈ విధానం ద్వారా మన జిల్లాలో లభించే మట్టిని వినియోగించి, పర్యావరణానికి అనుకూలంగా, ఉపాధి సృష్టించే విధంగా గ్రామపంచాయతీలలో అంగనవాడి భవనాలు, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్సులు, ఎస్‌ఎస్‌జి వర్క్ షెడ్లు, కాంపౌండ్ వాల్లు, పశువుల పాకలు, మేకల/గొర్రెల పాకలు, పౌల్ట్రీ షెడ్లు వంటి నిర్మాణాలను చేపట్టాలని కలెక్టర్ శిక్షణ పొందిన అధికారులకు దిశానిర్దేశం చేశారు.అదేవిధంగా, మేకల షెడ్డు నిర్మాణానికి సంబంధించిన నమూనాను పరిశీలించి, వీలైనంత తక్కువ ఖర్చుతో మెరుగైన నాణ్యమైన మేకల షెడ్లను నిర్మించేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.అలాగే, స్థానిక జాతి మేకల అభివృద్ధి కోసం మంచి జాతి మేకల పోతులను ఎంపిక చేసి, ఏదైనా ఒక గ్రామంలో ఐదు పోతులను పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశానికి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, పశువైద్యులు డాక్టర్ ఆనంద్, డాక్టర్ సంతోష్, డాక్టర్ బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: