తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు, 11/04/2026న, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమం 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక'లో భాగంగా మరియు 'ఆరోగ్య వారోత్సవాల' (Health Week) సందర్భంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల (Habit-Forming Drugs) దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు.మందుల నాణ్యత, లభ్యత మరియు నిబంధనల అమలును నిర్ధారించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో డ్రగ్స్ కంట్రోల్ విభాగం అధికారులు ఈ క్రింది అంశాలపై వివరణాత్మక సమాచారాన్ని అందించారు:అలవాటుగా మారే మందుల దుర్వినియోగం మరియు వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన.యాంటీబయాటిక్స్ దుర్వినియోగం మరియు యాంటీ-మైక్రోబియల్ రెసిస్టెన్స్ (సూక్ష్మజీవుల నిరోధకత) షెడ్యూల్ H2 మందుల కోసం QR కోడ్ వెరిఫికేషన్‌ను ప్రోత్సహించడం.QR కోడ్ ఆధారంగా మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలను (Side Effects) రిపోర్ట్ చేయడం.లైసెన్స్ పొందిన ఫార్మసీల ఆన్‌లైన్ వెరిఫికేషన్.నకిలీ మందులకు సంబంధించి ఫిర్యాదుల కోసం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్‌లైన్ (1800-599-6969) వినియోగం. ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల విద్యార్థులు, ఫార్మసిస్టులు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు కలిపి సుమారు 150 మంది పాల్గొన్నారు. అవగాహన యాత్రలో భాగంగా ముందుగా ర్యాలీ నిర్వహించి, అనంతరం కూలీ లైన్ లోని కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ భవన్‌లో సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడకూడదని, యాంటీబయాటిక్స్‌ను దుర్వినియోగం చేయకూడదని మరియు మందులను బాధ్యతాయుతంగా వాడాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా prohibition and ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ జానయ్య గారు మరియు DM & HO sri తుకారాం రాథోడ్ గారు హాజరయ్యారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో విద్యార్థులు మరియు ఆరోగ్య రంగ భాగస్వాముల పాత్ర ఎంత కీలకమో వారు వివరించారు. ఈ సందర్భంగా ఫార్మసీ విద్యార్థుల కోసం వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు నిర్వహించగా, విజేతలకు prohibition and ఎక్సైజ్ సూపరింటెండెంట్ మరియు పి. విజయ్ రామ్ కుమార్, , ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈగల్ ఇన్స్పెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. జిల్లా కెమిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీ తిరుపతి రెడ్డి గరు, (అధ్యక్షులు), శ్రీ రవి గారు (కార్యదర్శి), శ్రీ లక్ష్మణచారి (కోశాధికారి) మరియు అసోసియేషన్ సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు. ఖమ్మం సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో తాము కట్టుబడి ఉన్నామని, అలవాటుగా మారే మందుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మరియు మందుల సరైన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ