తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 19 తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామం నందు పాలగుట్టపై వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 108 సార్లు హనుమాన్ చాలీసా మరియు గాయత్రీ హోమం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, భక్తుల సందడి, శ్రీకృష్ణ స్వామి దర్శనం భక్తి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ