తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : మణుగూరు నుండి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొనిజర్ల- పల్లిపాడు సమీపంలో శుక్రవారం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉండగా వారంతా తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. బస్సు ముందు భాగం కొంత మేరకు దెబ్బతిన్నప్పటికీ, ప్రయాణికులెవరికీ తీవ్ర గాయాలు కాలేదు. ప్రమాదానికి లారీ రాష్ డ్రైవింగ్ కారణమని స్థానికులు చెబుతున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ