తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడుగ్రామ పంచాయతీ స్థానిక ఎన్నిక ను నిలుపుదల చేస్తూ జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.హైకోర్టులో జూలూరుపాడు గ్రామ పంచాయితీ పై ఉన్న కేసు కారణంగా పంచాయతీ ఎన్నికలు జరపవద్దని ,హై కోర్టు ఆదేశాలు వచ్చేవరకు చర్యలు చేపట్టవద్దని సూచించారు. ఆ గ్రామనికి చెందిన రామారావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో జూలూరుపాడు గ్రామపంచాయతీ మధిర తాలూకాలో ఉన్నందున దాన్ని ఏజెన్సీ పంచాయతీగా ప్రకటించడం సరికాదన పిటిషన్లో పేర్కొన్నారు. జూలూరుపాడుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ ఉన్నందున ఎన్నికల ప్రక్రియ నిలిపి వేయాలంటూ కలెక్టర్ మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ