Tuesday, 26 May 2026 11:23:33 PM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

ఉద్యమకారుల సంక్షేమం కోసం కేకే కమిటీ కృషి చేయాలి

Date : 24 May 2026 04:31 PM Views : 67

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పొనుగోటి సంపత్ స్థానిక కొత్తగూడెంలోని విద్యానగర్ నందుగల ఉద్యమకారుల సంక్షేమ సంఘా జిల్లా కార్యాలయంలో ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు నవతన్ అధ్యక్షతన తొలి దశ మలిదశ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యమకారుల సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పొనుగోటి సంపత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రస్తుత తరుణంలో ఉద్యమకారుల సంక్షేమం కోసం ఏర్పాటైన కేకే కమిటీనీ స్వాగతిస్తున్నామని , యావత్తు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు హర్షించదగ్గ విషయమని, కేకే కమిటీలో ఉన్న సభ్యులు వారి విధివిధానాలలో కొన్ని మార్పులు జరగాలని, గత ప్రభుత్వం 1250 మంది అమరవీరుల కుటుంబాలలో 750 కుటుంబాలని ఆర్థికంగా ఆదుకున్నామని అసెంబ్లీ సాక్షిగా తెలియజేసి, రాష్ట్ర ఫైనాన్షియల్ పోర్టల్ లో నమోదు చేయడం జరిగిందని, మిగతా 500 కుటుంబాలను మొదట ప్రామాణికంగా తీసుకొని వారికి న్యాయం చేసి రెండో ప్రామాణికంగా జైలు జీవితం, కేసులు ఎఫ్ఐఆర్లు, రౌడీషీట్లు, పీడి యాక్ట్లు, వారిని రెండవ ప్రామాణికంగా తీసుకొని వారి ఆర్థిక, రాజకీయ,సామాజిక, స్థితిగతులు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని, గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో కొంతమంది ఉద్యమకారులకు ఆర్థికంగా రాజకీయంగా, వారి అభివృద్ధికి తోడ్పాటు అందజేశారని, అలాంటి లబ్ధి పొందిన వారిని నాలుగవ ప్రామాణికంగా తీసుకొని అసలు లబ్ధి పొందని ఉద్యమకారులను రెండవ ప్రామాణికంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పొనుగోటి సంపత్ కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో కేకే కమిటీని తప్పుదోవ పట్టించే విధంగా అనేక బూటకపు ఉద్యమకారుల సంక్షేమ సంఘం పుట్టకొస్తున్నాయని, ఉద్యమకాల సంక్షేమం పేరుతోటి ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేపించుకొని ఏఐ టెక్నాలజీని వినియోగించి ఎఫ్ఐఆర్ కాపీలలో ఇతరులు మరియు అప్స్కాండ్ చూపించిన స్థానంలో వారి ఆర్థిక రాజకీయ లబ్ధి పొందడానికి వెసులుబాటు కల్పిస్తున్న కొంతమంది నకిలీ ఉద్యమకారులను చేర్చుకొని నకిలీ ఎఫ్ఐఆర్లు సృష్టించడమే కాకుండా, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఉద్యమకారుల సమావేశాలు ఏర్పాటు చేసుకొని అసలైన తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వారి కార్యచరణ ఉంటుందని, అటువంటి ఉద్యమ సంఘం నాయకులకు నిక్కార్సైన తెలంగాణ ఉద్యమకారులచే పరాభావం తప్పదని హెచ్చరించారు. కేకే కమిటీకి ఇలాంటి నకిలీ ఎఫైర్లు గుర్తించడం చాలా కష్టతరం అవుతుంది కాబట్టి ఆనాటి సమైక్యాంధ్ర ప్రభుత్వం పటిష్టమైన ఇంటిలిజెన్సీ, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ విభాగాలను వినియోగించి నివేదికలు తెప్పించుకోవడం జరిగిందని, ఆ యొక్క ఉద్యమ రికార్డులు డిసిఆర్బి, డిస్టిక్ క్రైమ్ రికార్డ్ బోర్డులో ఆనాటి ఉద్యమాలు ఉద్యమకారులు చేసిన వివిధ రకాల కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నివేదికలు పొందుపరచడం జరిగిందని, డిస్టిక్ క్రైమ్ రికార్డ్ బోర్డు డేటా ఆధారంగా ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు, ఆనాడు తెలంగాణ ఉద్యమ ఏ సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడిన శ్రీకృష్ణ కమిటీ ఏ విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నిజ నిజాలు, ఉద్యమ తీరుతన్నులు పై ఆనాటి యుపియో ప్రభుత్వానికి ఏ తరహాలో నివేదిక ఇచ్చిందో అదే తరాలో ఈ కేకే కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జూన్ రెండవ తేదీ లోపు నివేదిక అందజేయాలని జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులకు తగిన గౌరవం అందజేసే కార్యచరణ రూపొందించుకోవాలని సూచించారు. అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమానికి క్షేత్రస్థాయిలో ఉద్యమ భావాలు పెంపొందించి ప్రత్యేక కార్యచరణ రూపొందించి దాని అమలులో విజయవంతమైన తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ను జరగబోయే క్యాబినెట్ విస్తరణలో విద్యాశాఖ మంత్రిగా తీసుకోవాలని, ఉద్యమానికి సంబంధంలేని వ్యక్తులను విద్యా కమిషన్ చైర్మన్ వేయడము ఎంతవరకు సబబు అని, విద్యా కమిషన్ చైర్మన్ గా నియమించిన వ్యక్తి ఎటువంటి క్షేత్రస్థాయి పరిశీలనలు, నూతన విద్యా విధానంపై మరియు విద్యార్థుల సంక్షేమం కోసం ఎటువంటి నివేదికలు అందజేయకపోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను బ్రష్టు పట్టిస్తుంది అని, రాజీనామా చేయడం విడ్డూరంగా ఉందని , విద్యాశాఖ కమిషన్ చైర్మన్ గా ఎటువంటి పర్యటన చేసి ఎటువంటి నివేదికలు అందజేస్తే ప్రభుత్వం అమలు పరచలేదో బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లా కలెక్టర్గా తెలంగాణ రాష్ట్రంలో సేవలందించడానికి విముకత వ్యక్తం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులుగా వెళ్లి అక్కడ ఏ రకమైన సేవలు అందించి ఎటువంటి పథకాలు అమలుపరిచాడో, ఆంధ్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో గమనించకుండా, ఆ వ్యక్తిని విద్యా కమిషన్ చైర్మన్ గా నియమించడంతో తెలంగాణ మేధావులు విస్మయానికి గురయ్యారని, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉన్న విద్యా శాఖను రాష్ట్ర క్యాబినెట్ విస్తీర్ణలో ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరామ్ గారికి విద్యా శాఖ మంత్రి ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర లో అమలవుతున్న విద్యా విధానంపై పూర్తి అవగాహన కోదండరాం కి విద్యాశాఖ మంత్రి ఇవ్వడంతో విద్యా విధానం మరింత మెరుగయి జాతీయ స్థాయిలో తెలంగాణలో అమలవుతున్న విద్యా విధానం మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలబడుతుందని కోరారు. ఈ సమావేశంలో తొలిదశ, మలిదశ ఉద్యమకారులు నవతన్, గూడెల్లి యాకయ్య, తెలంగాణ సురేష్, సాంబా పూర్ణ, తెలంగాణ క్రాంతి, కలకోటి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :