తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16 వ డివిజన్లో అపరిస్కృతంగా పేరుకపోయినా పారిశుద్ధ్యన్నీ మెరుగుపరచాలని, డివిజన్లోని కోతులు, కుక్కల సమస్యను పరిష్కరించాలని 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. 16వ డివిజన్లో అధికారులతో పర్యటించి మాట్లాడుతూ దోమల నివారణకు దోమల పొగ ,బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కార్పొరేషన్ ఎస్సై, మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ ఎస్సై మినహాజ అధికారులతో వార్డులోని నెహ్రూ బస్తి, లక్ష్మీ టాకీస్ ఏరియా, నాగయ్య గడ్డ, నేతాజీ బస్తి, బర్మా క్యాంప్, రాజీవ్ గాంధీ కాలనీలను సందర్శించారు. వీరితో పాటుగా పారిశుధ్య అధికారి వీరభద్ర చారి, శానిటరీ జవాన్ ప్రభుదాస్, డివిజన్ ప్రజలు కాంపల్లి దుర్గయ్య ,డి సత్యనారాయణ, టాటా మ్యాజిక్ సలీం ,జి వెంకన్న ,సంపత్, యు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ