తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సహజసిద్ధమైన, రోగాలురాని, సువాసనలతో కూడిన ఉత్పత్తులను నిత్యజీవితంలో, కుటుంబ సమేతంగా వాడుకోవాలని సహజ ప్రకృతి కవి, కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం వ్యవస్థాపకులు, కాలోజీ అవార్డు గ్రహీత డాక్టర్. జయరాజు అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక బస్టాండ్ సమీపంలో గల "ఉదయం నేచర్ క్యూర్ సెంటర్లో" కుంకుడు కాయల రసంతో తయారుచేసిన ఐదు రకాల ప్రొడక్ట్స్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో, అంతర్జాతీయంగా పేరుగాంచిన లోకసాని పద్మా రెడ్డి అనే రైతు ప్రకృతి సహజసిద్ధంగా కుంకుడుగాయలతో అనేక రకాల ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారని తెలిపారు. నిజ జీవితంలో మన వాడుకునే అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయని వెల్లడించారు. దీని ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి మహమ్మారిని సైతం ఓడించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రకృతి ప్రేమికులందరూ ఈ ఉత్పత్తులను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగా, నిరంతరం సమాజ సేవలో, ప్రకృతి సేవలో తరిస్తున్న ప్రకృతిక కవి జయరాజు _ మంగతాయి దంపతులను ఆశ్రమం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి ఆశ్రమం సభ్యులు స్థానిక ప్రకృతి వైద్యులు సుగుణారావు, రిటైర్డ్ సింగరేణి జిఎం శనగ వెంకటేశ్వర్లు, మనకీ బాత్ మొక్కల రాజశేఖర్, కరాటేలో గిన్నిస్ హోల్డర్ మాటూరు మహావిష్ణుమూర్తి, దయానందసాగర్, బంగారి శంకర్, శోభారాణి, దశరథ్ రజ్వాలు పాల్గొనగా చిన్నారి నైనిక రజ్వా జయరాజు దంపతులకు మొక్కను అందించి అభినందనలు అందుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ