తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యెర్రా కామేష్ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదానం జేబీపీ జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జున రావు జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,కొత్తగూడెం నియోజకవర్గ సమస్యలపై నిరంతరం పోరాడుతున్న యెర్రా కామేష్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని రైల్వే స్టేషన్,బస్టాండ్ ప్రాంతాల్లో యాచకులకు అన్నదానం చేసినట్టు జేబీపి జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు తెలిపారు.ఈసందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ కొత్తగూడెం ప్రాంత ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ధైర్యం ఉన్న ప్రశ్నించే గొంతుక,సామాజిక న్యాయం మరియు సమానత్వం కొరకు అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు వెళుతూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న బహుజన నాయకుడు యెర్రా కామేష్ అని,జైభీమ్ రావ్ భారత్ పార్టీ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిగా,అంతేకాకుండా ఈ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించే వ్యక్తిగా,కరోనా వంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు నిత్యావసర వస్తువులు,కూరగాయలు పంపిణీ చేసిన సామాజ సేవకుడిగా,ఈప్రాంత ప్రజల మన్ననలు అందుకున్న నాయకుడని,పేదలకు న్యాయవాదిగా సేవలు అందించడమే కాకుండా,బహుజన వర్గాల హక్కుల కోసం పోరాడుతున్న కామేష్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని రాజకీయాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని,రానున్న కాలంలో ప్రజా ప్రతినిధిగా ఈప్రాంత ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీరు నాయక్,వినయ్,నియోజకవర్గ అధ్యక్షులు నాగుల రవికుమార్,బంటు నరేందర్,సోనూ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ