Friday, 17 April 2026 07:35:45 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

Date : 15 April 2026 08:06 PM Views : 43

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. గండుగులపల్లిలో సోలార్ విద్యుత్ – మోడల్ ప్రాజెక్ట్ ప్రారంభం. అశ్వరావుపేట నియోజకవర్గం లో విద్యుత్ డివిజన్ కేంద్రం మంజూరు. అశ్వరావుపేట విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు .భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం జగ్గారం, మల్లారం గ్రామాలలో నిర్మించనున్న రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు , అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి, ఎన్పీడీసీఎల్ సిఎండీ వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తదితరులు పాల్గొని శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ అశ్వరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి నాణ్యమైన విద్యుత్ అత్యవసరమని పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు సాగించేందుకు విద్యుత్ ఉపకేంద్రాల సామర్థ్యాన్ని పెంచడం కీలకమని తెలిపారు. ఈ నేపథ్యంలో జగ్గారం, మల్లారం ప్రాంతాల్లో రెండు కొత్త ఉపకేంద్రాలను సుమారు రూ.5 కోట్ల వ్యయంతో మంజూరు చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామాన్ని మోడల్ సోలార్ గ్రామంగా అభివృద్ధి చేస్తూ, సుమారు 422 ఇండ్లకు సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించే లక్ష్యంతో రూ.23 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే అశ్వరావుపేట నియోజకవర్గంలో విద్యుత్ లైన్లు, పోల్స్ పునరుద్ధరణకు రూ.8 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.గిరిజన నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించేందుకు వ్యక్తికి నెలకు 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 6 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు కేటాయించగా, గిరిజన ప్రాంతాలకు అదనంగా 1000 ఇళ్లు మంజూరు చేసినట్లు వివరించారు. గిరిజనులను జనజీవన స్రవంతిలో కలపాలని వారిని అభివృద్ధిని పరచడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్న అని తెలిపారు.మహిళల కోసం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతున్నదని తెలిపారు. పోడు వ్యవసాయం అభివృద్ధి కోసం ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాల కింద ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా బోర్‌వెల్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.ఇందిరమ్మ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు బీమా రక్షణ అందిస్తున్నామని తెలిపారు. విద్యా రంగంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించనున్నామని అన్నారు .అశ్వరావుపేట నియోజకవర్గంలో విద్యుత్ సేవలను మరింత మెరుగుపరచేందుకు డివిజనల్ కార్యాలయాన్ని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఆసుపాక, కమలాపురం ప్రాంతాల్లో ఫీడర్ వ్యవస్థ బలోపేతం చేయడం అత్యవసరమని, రైతులు మరియు గృహ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు.నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఇళ్ల పైగా వెళ్లే పాత విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయని, వాటిని మార్చి కొత్త పోల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ సరఫరా మెరుగుపరచడానికి ప్రత్యేకంగా విద్యుత్ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందితేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు.ఎన్పీడీసీఎల్ సిఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ జగ్గారం, మల్లారం ఉపకేంద్రాల ద్వారా సుమారు 6 వేల మందికి, ముఖ్యంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ లోడును సమర్థంగా నిర్వహించే విధంగా ఈ ఉపకేంద్రాలు ఉపయోగపడతాయని చెప్పారు.జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , అశ్వరావుపేట నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ఉపకేంద్రాలు కీలకమని తెలిపారు. వీటి ద్వారా సుమారు 4 వేల మంది రైతులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ముఖ్యంగా వేసవి కాలంలో లో వోల్టేజ్, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు.దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో అమలు చేస్తున్న సోలార్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 422 ఇళ్లకు సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించనున్నట్లు, ఇది గ్రామ స్థాయిలో విద్యుత్ స్వాలంబన సాధించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఇతర గ్రామాలకు కూడా విస్తరించే అవకాశముందని అన్నారు .అనంతరం దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన మోడల్ సోలార్ ప్లాంట్‌ను పరిశీలించిన అనంతరం పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సోలార్ మీటర్‌ను ఆన్ చేసి గ్రామానికి విద్యుత్ సరఫరాను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్సీ మహేందర్,ప్రజాప్రతినిధులు,జిల్లా అధికారులు అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :