Sunday, 19 April 2026 02:23:11 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిల్మ్ మరియు విద్యార్థులకు వ్యాస రచన పోటీలకు ఆహ్వానం : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 14 October 2025 04:40 PM Views : 354

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని జిల్లా పరిధిలో గల ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి,మరియు విద్యార్థులకు వ్యాసరచన పోటీలకు సంబంందించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ ఈ నెల 21నుండి పలు కార్యక్రమాలను నిర్వహించబడుతాయని తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులతో పాటు, యువత ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్స్ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో పోలీసుల ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఇటీవల కాలంలో తీసిన (03) ఫోటోలు మరియు తక్కువ నిడివి (03 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈ నెల 25వ తేదీ లోపు జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫోటోలను పోలీస్ పిఆర్వో కు అందజేయాలన్నారు. ఈ పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు ????మూడనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు ????అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన. ????ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ. ????ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను ????సైబర్ నేరాలు ఈవ్ టీజింగ్,ర్యాగింగ్ ????మత్తు పదార్థాల సేవనం వాటి అనర్దాలు మరియు అవగాహన పెంపొందించే అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2024 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటివరకు తీసిన మూడు ఫోటోలు,షార్ట్ ఫిల్మ్ లు మాత్రమే పంపించాల్సి వుంటుంది. ఈ నెల 25 వ తారీఖు లోపు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని PRO సెక్షన్ నందు ఇవ్వాల్సి వుంటుందని తెలిపారు. విద్యార్థులకు వ్యాస రచన పోటీలు పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు (Essay Writing Competition) నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు,ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చని తెలియజేసారు.విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28 వ తేదీ లోగా సమర్పించాలని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది అంతే కాకుండా జిల్లా స్థాయిలో 1వ, 2వ, 3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు కూడా ప్రదానం చేయబడతాయని అన్నారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా,రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందాలని ఎస్పీ గారు సూచించారు. వ్యాసరచన అంశం (Essay Topic): “Drugs Menace: Role of Police in Prevention and How Students Can Stay Away from Drugs” (డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స్‌ నుండి ఎలా దూరంగా ఉండగలరు) పోటీలో పాల్గొనే విధానం 1. కింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేసి పాల్గొనండి: ???? https://forms.gle/jaWLdt2yhNrMpe3eA 2. మీ పేరు, విద్యార్హత మరియు ఇతర వివరాలు నమోదు చేయండి. 3. వ్యాసాన్ని పేపర్‌పై రాసి, దానిని చిత్రం (image) లేదా PDF ఫార్మాట్‌లో (500 పదాలు మించకూడదు) అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయండి. మరిన్ని వివరాల కోసం 8712682121 నెంబర్ ద్వారా పీఆర్ఓ ను సంప్రదించాలన్నారు.సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమించి అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించబోయే కార్యక్రమాలలో, పోటీలలో విధ్యార్థులతో పాటు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :