తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : దమ్మపేట మండలం నాచారం గ్రామపంచాయతీ మర్రిగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడంతో గృహప్రవేశ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా లబ్ధిదారులైన కిన్నెర మయూరి - వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు పేద ప్రజలకు సొంత ఇంటి కల కలగానే మిగిలిపోకుండా నిజం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుందని ఆయన తెలిపారు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చీకటి రమాదేవి, ఉప సర్పంచ్ కువారపు శామిని, హౌసింగ్ నియోజకవర్గం ఏఈ జి. రాము, గ్రామశాఖ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ యాపకుంట్ల వెంకమ్మ, ఎర్రగొర్ల రాధాకృష్ణ, మారబోయిన హరిబాబు, చీకటి ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు...
Admin
తెలుగు వెలుగు టీవీ