తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు మల్టీ జోన్-1 ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారు కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.ముందుగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారు ఐజీ గారికి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.అనంతరం ఐజి గారు కొత్తగూడెం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిసరాలను సందర్శించి,పోలీస్ స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఐజి గారు మాట్లాడుతూ వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యల పరిష్కారానికి బాధ్యతగా పనిచేయాలని సూచించారు.100 డయల్ కు ఫోన్ రాగానే వెంటనే స్పందించి భాధితులకు అండగా నిలవాలని తెలిపారు.
విజిబుల్ పోలీసింగ్లో భాగంగా పెట్రోలింగ్ మరియు బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతరం రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేశారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని నేరాలను చేదించడంలో మరియు నేరాలను నియంత్రించడంలో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారితో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ ఐపీఎస్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,సీఐ కరుణాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ